మెయిన్ మెనూ

NAMASTHE NAMO

*శుభోదయం మిత్రులారా!*
*బుధవారం –: 06-03-2024 :–*

    *జీవితం* అన్నాక *సమస్యలు* లేకుండా ఎలా ఉంటుంది వాటి పట్ల మనం *స్పందించే* తీరు మారాలి.

     శ్రద్ధగా *రాస్తే* చేతిరాతే మారినప్పుడు శ్రమిస్తే *తలరాత* మారావా *ఒంటరిగా* ఉన్న *అక్షరాలు జత* కడితే *అర్థవంతమైన పదాలుగా* మారినట్లు *మంచి* వారితో *స్నేహం* వల్ల *మన జీవితం* కూడా *అందంగా* మారిపోతుంది చేతి *రాతలో* తప్పులుంటే *సరిదిద్దుకో* వచ్చు కానీ *తలరాతను* మాత్రం *కష్టమైన సుఖమైన* అనుభవించాల్సిందే .

     *మాటల్లో* మధురత *నవ్వుల్లో* స్వచ్ఛత *మోహం* లో ప్రశాంతత *ప్రవర్తనలో* నిజాయితీ ఉన్నప్పుడు *జీవితంలో* ఎలాంటి *ఒత్తిడినైనా* అధిగమించవచ్చు నీకున్న *అందమైన రూపం* కేవలం *ఎదుటివారి కళ్ళను* మాత్రమే దోచుకుంటుంది *కానీ* అందమైన *వ్యక్తిత్వం* ఉంటే నీ *చుట్టూ* ఉన్న వారి *మనసులను* కూడా దోచుకుంటుంది.

ఏపీ ప్రయోజనాలను కాపాడటానికి కలిసి పనిచేయాలని భాజపా, తెదేపా, జనసేన నిర్ణయించాయి. ఈ దిశలోనే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి ఒప్పందం చేసుకున్నాయి. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకుగాను భాజపా, జనసేన కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల్లో పోటీచేయాలని ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. గురువారం రాత్రి అమిత్‌ షా, జేపీ నడ్డా, చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌ల మధ్య జరిగిన సమావేశంలో ఈ దిశగానే చర్చలు జరిగినట్లు సమాచారం. పొత్తుల విషయంలో ఆలస్యమైనందున మిత్రపక్షాల మధ్య ఓట్ల బదిలీని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించాలని, విజయావకాశాల ఆధారంగానే ముందుకెళ్లాలని మూడు పక్షాలు నిర్ణయించినట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున 400కు పైగా సీట్లు సాధించి కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోదీ.. దాన్ని సాధించడానికి ఎన్డీయే పూర్వ మిత్రపక్షాలన్నింటినీ ఆహ్వానించడం, అందులో భాగంగా తెదేపాకూ ఆహ్వానమందడంతో చంద్రబాబు ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు తెదేపా వర్గాలు పేర్కొన్నాయి.

అయిదేళ్లలో దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ ముందుకెళ్తుంటే.. ఏపీ ఒక్కటే వెనక్కుపోయే పరిస్థితి ఉందని, వచ్చే ఎన్నికల్లో తెదేపా నెగ్గి అధికారపగ్గాలు చేపట్టినా కేంద్ర సాయం లేకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం సాధ్యం కాదన్న ముందుచూపుతోనే కలిసి పనిచేయడానికి చంద్రబాబు అడుగు ముందుకేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తొలి అయిదేళ్లలో చంద్రబాబు చొరవ తీసుకొని విభజన చట్టంలో చెప్పిన ఐఐటీ, ఐఐఎం, పెట్రోలియం యూనివర్సిటీ, గిరిజన విశ్వవిద్యాలయం, కేంద్ర విశ్వవిద్యాలయం, ట్రిపుల్‌ఐటీ, ఎయిమ్స్‌లకు భూములు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే నిధులు మంజూరు చేయడంవల్ల చకచకా నిర్మాణాలు జరిగినట్లు తెదేపా వర్గాలు గుర్తుచేస్తున్నాయి. అలాగే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రవ్యాప్తంగా సిమెంటు రోడ్లు నిర్మించిన విషయాన్నీ ప్రస్తావిస్తున్నాయి. పోలవరం కూడా 70% గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయిందని ప్రత్యేకంగా పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకునే పాలనానుభవం చంద్రబాబుకు ఉన్నందున ఇప్పుడూ కేంద్రంతో కలిసి పనిచేయడం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న భావనలో ఆయన ఉన్నట్లు తెదేపా వర్గాలు పేర్కొన్నాయి.

కేంద్రప్రభుత్వం కూడా గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకొని ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధమైనట్లు చెబుతున్నాయి. ఇదివరకు వాజ్‌పేయీ హయాంలో కానీ.. గత మోదీ ప్రభుత్వంలో కానీ చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రయోజనాలను తప్పితే ఎప్పుడూ వ్యక్తిగతంగా ఏదీ కోరలేదని, ఆ విషయం భాజపా అగ్రనేతలకూ తెలుసు కాబట్టే 2018లో ఎన్డీయే నుంచి వైదొలిగినప్పటికీ మళ్లీ ఇప్పుడు కలిసి పనిచేద్దామని ఆహ్వానించినట్లు ఉదహరిస్తున్నాయి. ప్రధాని మోదీ తాను మూడోసారి అధికారం చేపడతానన్న ధీమాతో దేశాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని సంకల్పించుకొని నీతీశ్‌ కుమార్‌, నవీన్‌ పట్నాయక్‌ లాంటి పాతమిత్రులను కలుపుకెళ్లాలని నిర్ణయించారని, అందుకే చంద్రబాబునూ ఆహ్వానించినట్లు కనిపిస్తోందని పేర్కొన్నాయి. వచ్చే అయిదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో మూడో స్థానానికి తీసుకెళ్లాలని నిర్ణయించినందున ప్రధానమంత్రి మోదీ మౌలిక వసతులు, సంస్కరణలకు విస్తృత ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందని, వాటిపై చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉన్నందున దేశంలో మరే రాష్ట్రంలో లేనట్టుగా ఉపయోగించుకొని రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే వీలుందని పార్టీ నేతలు తెలిపారు.

మూడు పక్షాల నేతలూ రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం వల్లే ఎవరూ సీట్ల సంఖ్యకు కాకుండా రాష్ట్రానికి ప్రాధాన్యమిచ్చేలా చర్చించినట్లు చెబుతున్నారు. గత అనుభవాలు ఎలా ఉన్నా ఈ సమావేశంలో అందరూ మనసు విప్పి మాట్లాడుకున్నట్లు పేర్కొంటున్నారు. అందుకే జనసేన ఇదివరకు 24 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించినా ప్రస్తుతం భాజపా కూటమిలో చేరాలని నిర్ణయించాక ఇరు పార్టీలకు కలిసి కుదిరిన 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల్లో ఒక సీటు అటూఇటుగా సర్దుకుపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. బహుశా భాజపా ఆరు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయొచ్చని చెబుతున్నారు. అసెంబ్లీ స్థానాల్లోనూ ఆ రెండు పార్టీల మధ్య ఒకటి అటూఇటుగా సర్దుబాటు జరగవచ్చని తెలుస్తోంది. 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలపై మూడు పార్టీలూ అవగాహనకు వచ్చినందున ఆ స్థానాలపై తదుపరి చర్చ జరగవచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి మూడు పార్టీల అగ్రనేతలు శుక్రవారం మరోసారి సమావేశం కావాలనుకున్నా అమిత్‌ షా, జేపీ నడ్డాలకున్న ముందస్తు కార్యక్రమాల వల్ల సాధ్యం కాలేదని తెలిసింది. అందువల్ల శనివారం ఉదయం 11 గంటలకు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మిగిలిన అన్ని అంశాలపై పూర్తి ఒప్పందం చేసుకునే అవకాశమున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ పొత్తులపై మూడు పార్టీల వారెవ్వరూ అధికారికంగా ప్రకటించలేదు. శనివారం భేటీ అయిన తర్వాత దీనిపై అధికార ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు.


కేంద్ర ప్రభుత్వ మద్దతు అవసరమే!

రాష్ట్ర బ్రాండ్‌ ఇమేజ్‌ను జగన్‌ దారుణంగా దెబ్బతీశారన్న అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నారు. అందువల్ల కేంద్ర సహకారంతోనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలమని భావిస్తున్నారు. తెదేపా హయాంలో మూడు కొత్త విమానాశ్రయాలను ప్రతిపాదించి అందులో కర్నూలును పూర్తి చేసినా.. అయిదేళ్లలో విశాఖపట్నం, దగదర్తి విమానాశ్రయాలను జగన్‌ ప్రభుత్వం పూర్తిచేయలేకపోయింది. రాష్ట్రం కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే వారు ప్రాధాన్యమివ్వడం వల్ల ఇలాంటి పనులు చేయలేకపోయారు. తెదేపా తొలినుంచి రాష్ట్ర ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తున్నందున కేంద్ర సాయంతో ఇలాంటి విమానాశ్రయాలను పూర్తిచేయడం, కేంద్రం ప్రస్తుతం ప్రకటించిన సెమీకండక్టర్‌ లాంటి యూనిట్లతోపాటు భవిష్యత్తులో ప్రకటించే కొత్త పథకాల ప్రయోజనాలనూ అందిపుచ్చుకోవడానికి పొత్తు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

ప్రధాని మోదీ ప్రస్తుతం ప్రపంచంలోనే అగ్రనేతగా గుర్తింపు పొంది దేశంలోకి విస్తృత స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తున్నందున కేంద్రంతో కలిసి పనిచేయడం ద్వారా ఈ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని ఆంధ్రప్రదేశ్‌కూ తీసుకురావడం సాధ్యమవుతుందని ఆశిస్తున్నారు. కేంద్రం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోసం రూ.10వేల కోట్లతో కొత్త పథకం ప్రవేశపెట్టినందున ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్‌కున్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కేంద్ర సాయం దోహదం చేస్తుందని, దానివల్ల రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువ వస్తాయని చెబుతున్నారు.

జీవితం అన్నాక సమస్యలు లేకుండా ఎలా ఉంటుంది వాటి పట్ల మనం స్పందించే తీరు మారాలి. శ్రద్ధగా రాస్తే చేతిరాతే మారినప్పుడు శ్రమిస్తే తలరాత మారావా ఒంటరిగా ఉన్న అక్షరాలు జత కడితే అర్థవంతమైన పదాలుగా మారినట్లు మంచి వారితో స్నేహం వల్ల మన జీవితం కూడా అందంగా మారిపోతుంది చేతి రాతలో తప్పులుంటే సరిదిద్దుకో వచ్చు కానీ తలరాతను మాత్రం కష్టమైన సుఖమైన అనుభవించాల్సిందే . మాటల్లో మధురత నవ్వుల్లో స్వచ్ఛత మోహం లో ప్రశాంతత ప్రవర్తనలో నిజాయితీ ఉన్నప్పుడు జీవితంలో ఎలాంటి ఒత్తిడినైనా అధిగమించవచ్చు నీకున్న అందమైన రూపం కేవలం ఎదుటివారి కళ్ళను మాత్రమే దోచుకుంటుంది కానీ అందమైన వ్యక్తిత్వం ఉంటే నీ చుట్టూ ఉన్న వారి మనసులను కూడా దోచుకుంటుంది.

  •  

ఆసియా ఖండంలొనే ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు సర్వం సిద్ధమైంది. ఆదివాసీల ఆరాధ్యదైవాలైన సమ్మక్క, సారలమ్మ వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించేందుకు భక్తకోటి తండోపతండాలుగా తరలివస్తోంది.

 

    • 21 నుంది 24 వరకు నాలుగు రొజుల పాటు జాతర సాగుతుంది.

 

    • వనదేవతల దర్శనానికి ప్రపంచం నలుమూలల నుండి తరలిరానున్న భక్తకోటి.

 

    • 23 న రాష్ట్రపతి , సీఎం దర్శించుకోనున్నారు.

మేడారం: newsnow: దక్షిణభారత కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు సర్వం సిద్ధమైంది. ఆదివాసీల ఆరాధ్యదైవాలైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించేందుకు భక్తకోటి తండోపతండాలుగా తరలివస్తోంది. మహా ఘట్టాన్ని బుధవారం నుంచి నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.110 కోట్లతో ఏర్పాట్లను పూర్తిచేసింది. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం సమ్మక్క కుమారుడైన జంపన్నను కన్నెపల్లి నుంచి ఆదివాసీ నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య గిరిజనపూజారులు గద్దెలపైకి తీసుకొచ్చారు. పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠించడం జాతరలో తొలి కీలక ఘట్టం. అందులో భాగంగా బుధవారం ఉదయం ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గుడి నుంచి సారలమ్మ భర్త గోవిందరాజును పూజారులు గద్దెల వద్దకు తీసుకొస్తారు. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొచ్చే ఘట్టం ఎంతో కోలాహలంగా జరుగుతుంది. కన్నెపల్లి గ్రామస్థులైన ఆడపడుచులు సారలమ్మ ఆలయాన్ని ముగ్గులతో అందంగా అలంకరిస్తారు. సాయంత్రం అమ్మవారిని పూజారులు ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకొస్తారు. రెండో రోజు గురువారం సమీపంలోని చిలకలగుట్టపై ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు పూర్తిచేశాక, ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకొచ్చి సమ్మక్కను ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం నిండు జాతర కాగా, శనివారం దేవతల వన ప్రవేశంతో మేడారం జాతర ముగుస్తుంది.14 వేల మంది పోలీసులు.. 700 సీసీ కెమెరాలుపోలీసు శాఖ బందోబస్తు కోసం 14 వేల మందిని రంగంలోకి దింపింది. భక్తుల భద్రత కోసం పోలీసు, రెవెన్యూ శాఖలు కలిపి 700 వరకు సీసీ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశారు. ‘మహాలక్ష్మి పథకం నేపథ్యంలో 40 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లోనే వస్తారనే అంచనాలతో మేడారంలో 52 ఎకరాల్లో ప్రయాణ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాం. భక్తులకు ఆన్‌లైన్‌లో ప్రసాద వితరణ సేవలను అందుబాటులోకి తెచ్చాం. జంపన్నవాగు వద్ద భక్తుల పుణ్య స్నానాలకు వీలుగా లక్నవరం జలాశయం నుంచి నీటిని వదిలారు. పిల్లలు, వృద్ధుల కోసం అయిదు వేలకుపైగా జల్లు స్నానాల ఘాట్లపై ఏర్పాటుచేశాం. మేడారం పరిసరాల్లో 5,730 మరుగుదొడ్లను ఏర్పాటుచేశాం’ అని అధికారులు వెల్లడించారు.10 లక్షల వాహనాల పార్కింగ్‌కు సదుపాయంఆర్టీసీ బస్సులు, ప్రయివేటు వాహనాల పార్కింగ్‌ కోసం పోలీసులు వేర్వేరు దారులతో రూట్మ్యాప్‌ సిద్ధంచేశారు. ఆర్టీసీ బస్సులు తాడ్వాయి మీదుగా, ప్రయివేటు వాహనాలు పస్రా మీదుగా జాతరకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రయివేటు వాహనాల పార్కింగ్‌ కోసం పస్రా నుంచి మేడారం వరకు 40 ప్రాంతాల్లో పార్కింగ్‌ స్థలాలను సిద్ధం చేశారు. అన్నింటిలో కలిపి సుమారు 10 లక్షల వాహనాలు నిలిపేలా సౌకర్యాలు కల్పించినట్టు అధికారులు వెల్లడించారు.


తరలిరానున్న ప్రముఖులురాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఫిబ్రవరి 23న అమ్మలను దర్శించుకుంటారని మంత్రి సీతక్క తెలిపారు. గవర్నర్‌ తమిళిసై, సీఎం రేవంత్‌రెడ్డి కూడా అదే రోజు మేడారానికి విచ్చేయనున్నారు. జాతర సమయంలో కోటిన్నర మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారనేది సర్కారు అంచనా. అందుకు అనుగుణంగా భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. సీతక్క మేడారంలోనే ఉంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.


పూనుగొండ్ల నుంచి మేడారం పయనమైన పగిడిద్దరాజు మహబూబాబాద్‌, NewsNow, గంగారం: మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో మహాజాతర తొలి ఘట్టం మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా సమ్మక్క భర్త పగిడిద్దరాజు ఆలయంలో పెనుక వంశీయులు, పూజారులు రహస్య పూజలు నిర్వహించారు. పడగ రూపంలో ఉన్న పగిడిద్దరాజును ముస్తాబుచేశారు. పూజారి జగ్గారావు పడగను పట్టుకుని ఆదివాసీ సంప్రదాయాల నడుమ మేడారానికి కాలినడనక బయలుదేరారు. పగిడిద్దరాజు పడగతో పూజారులు దట్టమైన అటవీమార్గం గుండా, పోలీసు బందోబస్తు మధ్య మేడారం వరకు 70 కి.మీ. కాలినడకన ప్రయాణం చేస్తారు. బుధవారం సాయంత్రానికి జంపన్న వాగు వద్దకు చేరుకుంటారు. అక్కడ కొక్కెర వంశీయులు ఎదుర్కోలు నిర్వహిస్తారు. పెనుక వంశీయులు సమ్మక్కకు చీర, పసుపు, కుంకుమతో సారె ఇస్తారు. కొక్కెర వంశీయులు పగిడిద్దరాజుకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 9 గంటలకు పగిడిద్దరాజు తన బిడ్డ సారలమ్మ, అల్లుడు గోవిందరాజుతో కలిసి ఊరేగింపుగా వచ్చి గద్దెలపై కొలువుదీరుతారు.

ప్రజలతో మమేకం అయ్యేందుకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

వాలీబాల్‌ ఫైనల్‌ పోటీలను ప్రారంభిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

 ముగిసిన క్రీడా పోటీలు

గద్వాల క్రైం, ఫిబ్రవరి 15 : ప్రజలతో మమేకం అయ్యేందుకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. యువత క్రీడా పోటీల్లో మంచి స్ఫూర్తి కనబరిచారని, ఇదే స్ఫూర్తితో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్యువల్‌ గేమ్స్‌ మీట్‌-2024 గురువారం ముగిసింది. ఈ సందర్భంగా వాలీబాల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను కలెక్టర్‌, ఎస్పీ, అదనపు కలెక్టర్‌లతో కలిసిప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం, ప్రజలు కలిస్తే ఏదైనా సాధ్యం అన్నారు. యువత తమ ప్రాంతంలో జరిగిన సంఘటనలపై ఎలాంటి సమాచారమున్నా పోలీస్‌ వారికి తెల్పాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో వలంటీర్లుగా పని చేసేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ఎస్పీ రితిరాజ్‌ మాట్లాడుతూ అన్యువల్‌ గేమ్స్‌ మీట్‌-2024లో భాగంగా వాలీబాల్‌, క్రికెట్‌ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. వాలీబాల్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో మల్దకల్‌, గద్వాల టౌన్‌ జట్లు అద్భుతమైన టీమ్‌ వర్క్‌ చేశాయన్నారు. వాలీబాల్‌ పోటీల్లో మొదటి బహుమతిని మల్దకల్‌, రెండవ బహుమతిని గద్వాల డీటీవో జట్లు కైవసం చేసుకున్నాయి. క్రికెట్‌ పోటీల్లో జిల్లా పోలీస్‌ కార్యాలయం జట్లు మొదటి స్థానం, 10వ బెటాలియన్‌ జట్లు రెండవ స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. విజేత జట్లకు కలెక్టర్‌, ఎస్పీలు ప్రశంశాపత్రాలు, కప్‌లను బహూకరించారు. అనంతరం ఎర్రవల్లిలోని ఏకశిల, సరస్వతీ పాఠశాల చిన్నారులు ప్రదర్శించిన సైబర్‌క్రైమ్స్‌ నాటకం, ఇతర సాంసృతిక, నృత్య కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అపూర్వచౌహాన్‌, ఆర్టీవో పురుషోత్తంరెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సాయుధ దళ డీఎస్పీ నరేందర్‌రావు, సిబ్బంది పాల్గొన్నారు.

శాసనసభలో సభా సంప్రదాయాలను ఉల్లంఘించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారపక్షం మాట్లాడిన తర్వాత ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకపోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని చెప్పారు.

Show Buttons
Hide Buttons